Siddipet: జనగణన 2027లో స్వీయ గణనలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు

Siddipet: జనగణన 2027లో స్వీయ గణనలో భాగంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు బొప్పాపూర్‌లో తన వివరాలు నమోదు చేసుకున్నారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 29 April 2026 11:53 AM IST
Siddipet
X

Siddipet

Siddipet: జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా స్వీయ గణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘు నందన్ రావు పిలుపునిచ్చారు.

సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో నిర్వహించిన జనాభా లెక్కల స్వీయ గణన కార్యక్రమంలో ఆయన పాల్గొని తన వివరాలను నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి జనగణన అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కుటుంబ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story