Siddipet: ఆర్టీసీ సమ్మెపై ఎంపీ రఘునందన్ రావు ఫైర్.. రేవంత్ రెడ్డికి సవాల్
Siddipet: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం. రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డుపెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపణ.
Siddipet: ఆర్టీసీ సమ్మెపై ఎంపీ రఘునందన్ రావు ఫైర్.. రేవంత్ రెడ్డికి సవాల్
సిద్దిపేట: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది. తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఈ సమ్మెపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డుపెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్టీసీ డిపో ముందు కార్మికులు చేస్తున్న ఆందోళనకు రఘునందన్ రావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , "రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డంపెట్టి ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూడడం బాధాకరం" అని ఎంపీ అన్నారు. "అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆ హామీ నెరవేరలేదు. పైగా కార్మికులను రోడ్డు మీద పడేశారు" అని రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.




