Siddipet: బొప్పాపూర్‌లో తాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం!

Siddipet: సిద్దిపేట జిల్లా బొప్పాపూర్‌లో కాలిపోయిన మంచినీటి మోటారు స్థానంలో తక్షణమే కొత్త మోటారు ఏర్పాటు చేసిన సర్పంచ్ మాధవనేని భానుప్రసాద్.

KARUNAKAR,	DUBBAK
Published on: 12 July 2026 5:44 PM IST
Siddipet
X

Siddipet: బొప్పాపూర్‌లో తాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం!

Siddipet: గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా తక్షణ చర్యలు

కాలిపోయిన మంచినీటి మోటారు స్థానంలో కొత్త మోటారు ఏర్పాటు:సర్పంచ్ భానుప్రసాద్

ప్రజలకు నిరంతర స్వచ్ఛమైన తాగునీటి సరఫరాకు గ్రామ పంచాయతీ కట్టుబడి ఉంది సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరంగా మంచినీటిని అందించాలనే లక్ష్యంతో గ్రామంలో తాగునీటి సరఫరాకు వినియోగిస్తున్న ప్రధాన నీటి మోటారు పూర్తిగా కాలిపోవడంతో, గ్రామ పంచాయతీ వెంటనే స్పందించి అత్యవసర చర్యలు చేపట్టింది.

ప్రజలకు మంచినీటి సరఫరా నిలిచిపోకుండా ఉండేందుకు ఎలాంటి ఆలస్యం చేయకుండా కొత్త నీటి మోటారును కొనుగోలు చేసి ఈరోజు విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది.గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరా అత్యంత కీలకమైన అంశంగా భావించిన గ్రామ పంచాయతీ, సమస్యను గుర్తించిన వెంటనే అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేసి కొత్త మోటారును అమర్చింది. దీంతో గ్రామంలో మంచినీటి సరఫరా తిరిగి యథావిధిగా ప్రారంభమై ప్రజలకు ఉపశమనం లభించింది.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story