Cheryal: చేర్యాలలో ఘనంగా బతుకమ్మ సంబరాల ఏర్పాట్ల పరిశీలన!

Cheryal: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్ పరిశీలించి అధికారులకు తగు సూచనలు జారీ చేశారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 8 Oct 2026 12:29 PM IST
Cheryal
X

Cheryal: చేర్యాలలో ఘనంగా బతుకమ్మ సంబరాల ఏర్పాట్ల పరిశీలన!

Cheryal: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో కుడి చెరువు వద్ద బతుకమ్మ పండుగ ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో గురువారం పరిశీలించారు మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలిస్తూ మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్ని వసతులు కల్పించాలని కమిషనర్ ఆదేశించారు.

మున్సిపల్ కమిషనర్ అభిలాష్, మున్సిపల్ చైర్మన్ అరుణ పాల్గొని ఘాట్ల పరిశుభ్రత, విద్యుత్ దీపాలు, రక్షణ బారికేడ్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మహిళలకు ఇబ్బందులు లేకుండా వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముస్త్యాల అరుణ వైస్ చైర్మన్ మేడిశెట్టి ఉమా కౌన్సిలర్ నిమ్మ సుప్రజ తదితరులు పాల్గొన్నారు

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL