Dubbaka: దుబ్బాకలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం. రైతులు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేతల సూచన.

Chindam Karunakar, Dubbak
Published on: 21 April 2026 10:19 AM IST
Dubbaka
X

Dubbaka

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో వరి కొనుగోలు కేంద్రం (ఐకేపీ సెంటర్)ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగర రవి, వైస్ చైర్‌పర్సన్ ఆస సులోచన స్వామి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ బడుగు రాజు, 11వ వార్డు కౌన్సిలర్ నందాల శ్రీకాంత్, 12వ వార్డు కౌన్సిలర్ బండి శ్రీలేఖ రాజు తదితర స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దుబ్బాక మరియు పరిసర ప్రాంతాల రైతులు ఈ వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వ మద్దతు ధరల ప్రయోజనాలను పొందాలని సూచించారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story