Dubbaka: దుబ్బాకలో రైతుల కన్నీటి గోస.. తడిసిన ధాన్యం.. పట్టించుకోని సర్కారు!

Dubbaka: దుబ్బాకలో భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం. కొనుగోళ్లలో జాప్యంపై సీపీఎం ఆగ్రహం. వెంటనే పంటను సేకరించాలని అధికారులకు డిమాండ్.

Chindam Karunakar, Dubbak
Published on: 27 May 2026 1:42 PM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాకలో రైతుల కన్నీటి గోస.. తడిసిన ధాన్యం.. పట్టించుకోని సర్కారు!

సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్.. రాత్రి కురిసిన ఆకాల వర్షం వలన పూర్తిగా తడిసిపోయిన ధాన్యం.. రైతులు పంట పండించి సొసైటీ మరియు ఐకేపీ కొనుగోలు కేంద్రాలలోకి వరి ధాన్యాన్ని తీసుకువచ్చి రెండు నెలల పూర్తవుతున్న రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలులో జాప్యం వలన తడిసిన వడ్లు.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కంపే ఎల్లయ్యా రైతులు నారాయణరెడ్డి, ప్రతాప్ రెడ్డి,నరసయ్య,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story