Siddipet: వరి కొయ్యలు కాల్చొద్దు.. భూసారం, పర్యావరణానికి చేటు!

Siddipet: వరి కొయ్యలను, పారేసిన గడ్డిని తగలబెట్టడం వల్ల భూసారం దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని మిరుదొడ్డి మండల వ్యవసాయ అధికారి సత్యాన్వేష్ హెచ్చరించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 26 May 2026 8:03 AM IST
Siddipet
X

Siddipet: వరి కొయ్యలు కాల్చొద్దు.. భూసారం, పర్యావరణానికి చేటు!

Siddipet: పంటలు కోసిన వెంటనే రైతులు చేసే పొరపాటు పర్యావరణానికి నష్టం కలిగించడంతో పాటు భూసారం దెబ్బతినే పరిస్థితి నెలకొంటుందని వ్యవసాయ అధికారి సత్యాన్వేష్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో రైతులతో కలిసి మాట్లాడారు. వరి పంటను కోసిన తర్వాత గడ్డిని తగలబెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. గతంలో వరి పంట కోసిన తర్వాత కొద్ది రోజులపాటు నీటిని పొలంలో నిలువచేసి కానుకగాకొమ్మను

పలు చెట్ల కొమ్మలు. ఆకులు వేసి వాటిని కుల్లింప చేసేవారన్నారు. గడ్డిని తగలబెట్టడం తో పొలంలో రైతులకు మేలు చేసే సూక్ష్మజీవులు క్రిమికీటకాలు చనిపోవడంతో పాటు దట్టమైన పొగతో పర్యావరణం దెబ్బ తింటుందన్నారు. గడ్డిని తగలబెట్టే సమయంలో మంటలను అదుపు చేయకపోవడంతో ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. నేటికీ అక్కడక్కడ పంట పొలాలలో గడ్డిని రైతులు తగలబెట్టడం కనిపిస్తుందన్నారు. పంట కోసిన వెంటనే గడ్డి కుళ్ళిపోవడానికి సూపర్ పాస్పెట్ ఎకరాకు 50 కిలోల చొప్పున చల్లాలని వ్యవసాయ అధికారి సూచించారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story