Cherial: కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!
Cherial: చేర్యాలలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
Cherial: చేర్యాలలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!
Cherial: సిద్దిపేట.జిల్లా ఈ రోజు చేర్యాల మండల కేంద్రం రేణుక గార్డెన్ లో చేర్యాల, కొమురవెళ్లి, మద్దూర్,దూల్మిట్ట మండలంలోని లబ్ధిదారులకు కుట్టు మిషినులు, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు మండలాలలోని వివిధ పార్టీలకు చెందిన 53 మంది సర్పంచ్ లకు 5లక్షల చొప్పున ప్రతి గ్రామ పంచాయితీకి ఎంపీ నిధులు ఇవ్వాలి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని కోరారు.
తపస్ పల్లి రిజర్వయర్ ద్వార గోదావరి జలాలు నాలుగు మండలాల చెరువుల, కుంటలు నిండేలా అధికారులకు ఆదేశాలు జారీచేయాలి ఎమ్మెల్యే పల్లా కోరారు.
ఎంపీ చామల మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండాలి కోరారు.DMFT నుండి ఎంపీ నిధుల, కలెక్టర్ నిధుల నుండి గ్రామ పంచాయితీ లకు నిధులు మంజూరు చేయిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. గ్రామాల సమస్యలను బట్టి ఆయా గ్రామ పంచాయితీ సర్పంచ్ లు ప్రణాళికలు తయారు చేయాలి తనకు ఇవ్వాలని ఎంపీ కకోరారు.
అలాగే తపస్ పల్లి రిజర్వయర్ నుండి అన్ని గ్రామాల చెరువులు, కుంటాలకు నీళ్లు అందేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసి నీళ్లు విడుదల చేయిస్తానని తెలిపారు.




