Lingareddypally: లింగారెడ్డిపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి
Lingareddypally: సిద్దిపేట లింగారెడ్డిపల్లిలో పండుగ సాయన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్‌లను బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి చేర్చాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు.
Lingareddypally: లింగారెడ్డిపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి
Lingareddypally: బహుజనుల ఆత్మ బదువు తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరు పొందిన ముదిరాజ్ బిడ్డ పండుగ సాయన్న జయంతి ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని లింగారెడ్డిపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బొండ్ల రామస్వామి అన్నారు. అన్ని ప్రభుత్వాలు ముదిరాజ్ లను ఓటు బ్యాంకు గా వాడుకుంటున్నాయి తప్ప ముదిరాజ్ ల అభివృద్ధికి ఏమి చేయలేదన్నారు.
సిద్దిపేట మున్సిపల్ పరిధి 1 వార్డు లింగారెడ్డి పల్లి లో పండుగ సాయన్న జయంతిని ఘనంగా నిర్వహించారు.పెద్దమ్మ గుడి నుండి ముదిరాజ్ సంఘం నాయకులు బారి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముదిరాజ్ సంఘం జండా ఆవిష్కరించి పండగ సాయన్న చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా ముదిరాజ్ సంఘం నాయకులు బాలయ్య, రమేష్, శ్రీనివాస్ లతో కలిసి రామస్వామి మాట్లాడారు.
తెలంగాణ లో ఎక్కువ జనాబా కలిగిన ముదిరాజ్ లో ఉన్న ముదిరాజులు ఐక్యంగా పోరాడి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్నారు. బిసి డి లో కొనసాగుతున్న ముదిరాజ్ కులాన్ని బీసీ ఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు. సబ్బండవర్గాల కోసం బ్రిటిషోల్లతో పాటు మొగలులతో పోరాడిన వ్యక్తి పండుగ సాయన్న అన్నారు.
కార్యక్రమం లో ముదిరాజ్ సంఘల అధ్యక్షులు తాటికొండ కనకయ్య,బోనాల బాలయ్య, తాటికొండ లక్ష్మయ్య క్యాషియర్ తాటికొండ రాజేల్లయ్య,సెక్రటరీ జింక రాజు,ఉప్పలయ్య నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




