Toguta: ఓటరు జాబితా సవరణ: అందరూ పాల్గొనాలని బీజేపీ నేత పల్లె వంశీకృష్ణ గౌడ్ పిలుపు!

Toguta: దుబ్బాక నియోజకవర్గంలో SIR కార్యక్రమంపై బీజేపీ నేత పల్లె వంశీకృష్ణ గౌడ్ అవగాహన. ఈ నెల 25 నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, అందరూ పాల్గొనాలని పిలుపు.

Chindam Karunakar, Dubbak
Published on: 23 Jun 2026 1:00 PM IST
Toguta
X

Toguta: ఓటరు జాబితా సవరణ: అందరూ పాల్గొనాలని బీజేపీ నేత పల్లె వంశీకృష్ణ గౌడ్ పిలుపు!

Toguta: రాష్ట్ర పార్టీ మరియు, పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ఆదేశాల మేరకు "BJP కార్యాలయంలో "సిద్దిపేట జిల్లా తొగుట మండల బిజెపి నాయకుల సమావేశం జరిగింది, తొగుట మండల పార్టీ అధ్యక్షులు "చిక్కుడు చంద్రం" అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా SIR దుబ్బాక నియోజకవర్గ సమన్వయకర్త "పల్లె వంశీకృష్ణ గౌడ్" పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన SIR (Special Intensive Revision)ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఈనెల 25 నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా దౌల్తాబాద్ మండలంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాగలరని కోరడం జరిగింది.

SIR ప్రక్రియ అనేది బిజెపి చేపట్టిన కార్యక్రమం కాదని కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమమని చెప్పాడు. కేంద్రంలో ఇప్పటికీ ఈ కార్యక్రమం 13 సార్లు జరిగిందని, 1952 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన SIR కార్యక్రమం చివరగా 2002లో జరిగిందనీ అన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story