Siddipet: చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే కిలోమీటరు నడవాల్సిందేనా?
Siddipet: చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి పట్టణానికి దూరంగా ఉండటంతో రోగులు కిలోమీటరు దూరం నడవాల్సి వస్తోంది. వృద్ధులు, గర్భిణీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Siddipet: చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే కిలోమీటరు నడవాల్సిందేనా?
Siddipet: చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోగులకు కష్టాలు తప్పడం లేదు. పట్టణానికి దూరంగా ఆసుపత్రిని నిర్మించడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారి నుంచి ఆసుపత్రికి వెళ్లాలంటే బస్సులు లేదా ప్రైవేట్ వాహనాల్లో వచ్చి, అక్కడి నుంచి దాదాపు కిలోమీటరు దూరం కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
దీంతో వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు చంటిపిల్లల తల్లులు నడవలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు ఈ నడక మరింత భారంగా మారుతోంది. దీనికి తోడు ఆసుపత్రికి వెళ్లే దారిలో కోతులు దాడి చేసి కరుస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోగులకు వైద్యం అందించాల్సిన ఆసుపత్రికి చేరుకోవడమే ఇంత కష్టంగా మారడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి ప్రధాన రహదారి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు రవాణా సౌకర్యం కల్పించాలని, ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.




