Cheryal: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్న పట్టణ ప్రకృతి వనం!

Cheryal: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ ప్రకృతి వనం నిర్వహణ లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతోంది. పట్టించుకోని మున్సిపల్ అధికారులపై విమర్శలు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 27 Sept 2026 11:25 AM IST
Cheryal
X

Cheryal: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్న పట్టణ ప్రకృతి వనం!

Cheryal: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రం లో బైపాస్ రోడ్డులో పాత ఎస్ టి ఓ ఆఫీస్ ఏరియాలో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి పట్టణ ప్రకృతి భాగంలో లక్షలు వెచ్చించి చేర్యాల లో పట్టణ ప్రకృతి ఏర్పాటు చేశారు.

మొక్కలు నాటి చుట్టూ చిన్నపాటి ప్రహరి దాని పైన ఇనుప పైపులతో కంచ నిర్మించారు చెట్ల మధ్యలో సాయంత్రం పూట స్థానికులు వాకింగ్ చేసుకోవడానికి ట్రాక్ కూడా ఏర్పాటు చేశారు. కొంత మంది సాయంత్రం పూట కాసేపు సేద తీరేవారు. కానీ ఇప్పుడు దాని ఆలనా పాలనా చూసే నాధుడే కరవయ్యాడు సంవత్సరాల తరబడి గేటుకు తాళం వేయడంతో మొత్తం పిచ్చి మొక్కల తో పాటు చెత్త చెదారం నిండి పోయింది లోపలికి ఎవరు వెళ్లలేని పరిస్థితి.

ఇనుప పైపుల నుండి కొంతమంది లోపలికి వెళ్లి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణ వస్తున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రకృతి వనం లో పెరిగినటువంటి పిచ్చి మొక్కలను చెత్త చేదారం తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL