Siddipet: గ్రామంలో మద్యపాన నిషేధం.. మద్యం అమ్మినా తాగినా 50 వేల జరిమానా

Siddipet: సిద్దిపేట జిల్లాలో సంచలన నిర్ణయం! మద్యం రహిత గ్రామంగా మారిన పెద్ద మాసాన్ పల్లి. మద్యం అమ్మినా, తాగినా 50 వేల జరిమానా అని తీర్మానం.

Chindam Karunakar, Dubbak
Published on: 5 Jun 2026 8:23 AM IST
Siddipet
X

Siddipet: గ్రామంలో మద్యపాన నిషేధం.. మద్యం అమ్మినా తాగినా 50 వేల జరిమానా

Siddipet: సిద్దిపేట జిల్లాలో ఒక గ్రామం ఆదర్శవంతమైన నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. పల్లెల్లో మద్యం మహమ్మారిని తరిమికొట్టేందుకు ఆ గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు నడుం బిగించారు. గ్రామంలో మద్యం అమ్మినా, తాగినా ఏకంగా 50 వేల రూపాయల జరిమానా విధిస్తామని గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. అంతేకాదు, మద్యం గురించిన సమాచారం అందించిన వారికి 10 వేల రూపాయల బహుమతిని కూడా ప్రకటించారు.మద్యం రహిత గ్రామమే లక్ష్యంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్ద మాసాన్ పల్లి గ్రామం సంచలన నిర్ణయం తీసుకుంది.

గ్రామ సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఊరిలో గ్రామసభను నిర్వహించారు. ఈ సభకు ఊరి ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పల్లెల్లో మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, యువత పెడదోవ పడుతోందని గ్రామసభలో ఆందోళన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే గ్రామాన్ని ఆదర్శంగా మార్చేందుకు సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి నేతృత్వంలో గ్రామస్తులంతా కలిసి ఒక కీలకమైన ప్రతిజ్ఞ చేశారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story