Cheryal: కిలో చికెన్ కేవలం రూ.229కే విక్రయిస్తున్న పీజీ నిరుద్యోగి!

Cheryal: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల యువకుడు పీజీ పూర్తి చేసి ఉద్యోగం రాక స్వయం ఉపాధి బాట. కిలో చికెన్ కేవలం రూ.229లకే విక్రయిస్తూ ఆదర్శం.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 11 Nov 2026 12:25 PM IST
Cheryal
X

Cheryal: కిలో చికెన్ కేవలం రూ.229కే విక్రయిస్తున్న పీజీ నిరుద్యోగి!

Cheryal: ఉద్యోగం కోసం ఎదురుచూసి విసిగిపోయిన ఓ యువకుడు స్వయం ఉపాధి బాట పట్టాడు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన మిట్టపల్లి రాజు పీజీ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం లభించకపోవడంతో చికెన్ సెంటర్ ఏర్పాటు చేసి వ్యాపారం ప్రారంభించాడు.

వినియోగదారులకు తక్కువ ధరకు చికెన్ అందించాలనే ఉద్దేశంతో కిలో చికెన్‌ను కేవలం రూ.229కే విక్రయిస్తూ వినూత్న ఆఫర్ ప్రకటించాడు. కిలోకు కేవలం రూ.5 నుంచి రూ.10 వరకు మాత్రమే లాభం చూసుకుంటూ వ్యాపారం కొనసాగిస్తున్నాడు.

చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమ కాళ్లపై తాము నిలబడాలనే ఆలోచనతో రాజు చేస్తున్న ప్రయత్నం పలువురిని ఆకట్టుకుంటోంది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి ఒక మంచి మార్గమని రాజు నిరూపిస్తున్నాడు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL