Thoguta: కరెంట్ బిల్లు కష్టాలకు చెక్.. రైతులకు అదిరిపోయే స్కీమ్స్ ఇవే!
Thoguta: సిద్దిపేట జిల్లా తొగుటలో వైభవంగా రైతు వారోత్సవాలు. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ స్ప్రేయర్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించిన ఏడీఏ మల్లయ్య.
Thoguta: కరెంట్ బిల్లు కష్టాలకు చెక్.. రైతులకు అదిరిపోయే స్కీమ్స్ ఇవే!
తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో రైతు వేదిక నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం నందు రైతు వారోత్సవం లో భాగంగా వ్యవసాయ క్షేత్రాలు వ్యవసాయ యాంత్రికరణ సౌర విద్యుత్ అంశాలపై రైతులకు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో దుబ్బాక డివిజన్ ఏ డి ఏ కాంపాటి మల్లయ్య మాట్లాడుతూ రైతులు నూతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడానికి వ్యవసాయ యాంత్రీకరణ ఉపయోగపడుతుందని తెలిపారు యాంత్రికరణలో భాగంగా రైతులకు డ్రోన్స్ స్ర్పేయర్ వాడటం వల్ల కలిగే లాభాల గురించి తెలియజేయడం జరిగింది డ్రోన్ స్ర్పేయర్ తో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పంటలకు పురుగు తెగుళ్ల మందులను పిచికారి చేసుకోవచ్చని తెలిపారు, రైతులకు డ్రోన్స్ స్ర్పేయర్ పని విధానాన్ని వివరించడం జరిగింది.. విద్యుత్ ఏఇ శ్రీధర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య ఘర్ ముప్త్ బిజిలి యోజన పథకం, పి.యం కుసుమ్ పథకం గురించి వివరించడం జరిగింది.




