Gajwel: జాతీయ రహదారిపై ప్రమాదకర సైకిల్ స్టంట్లు: రైడర్‌కు పోలీసుల కౌన్సెలింగ్!
Gajwel: గజ్వేల్ జాతీయ రహదారిపై ప్రమాదకరంగా సైకిల్ నడుపుతూ స్టంట్లు చేసిన యువకుడిని పోలీసులు గుర్తించి, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
Gajwel: జాతీయ రహదారిపై ప్రమాదకర సైకిల్ స్టంట్లు: రైడర్‌కు పోలీసుల కౌన్సెలింగ్!
గజ్వేల్: జాతీయ రహదారిపై ప్రమాదకరంగా సైకిల్ నడుపుతూ, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన సైకిల్ రైడర్‌పై గజ్వేల్ టౌన్, ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేపట్టి సంబంధిత సైకిల్ రైడర్‌ను గుర్తించారు.
అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి, గజ్వేల్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ, గజ్వేల్ ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ సమక్షంలో సైకిల్ రైడర్‌తో పాటు అతని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జాతీయ రహదారిపై ప్రమాదకరంగా సైకిల్ నడపడం, స్టంట్లు చేయడం వల్ల రైడర్ ప్రాణాలతో పాటు ఇతర వాహనదారులు, పాదచారుల ప్రాణాలకు సైతం తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పోలీసులు వివరించారు.
భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదకర రైడింగ్, స్టంట్లకు పాల్పడకుండా రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సైకిల్ రైడర్‌కు సూచించారు. అలాగే తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి, రహదారి భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలని పోలీసులు సూచించారు.
ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
జాతీయ రహదారులు, ఇతర ప్రధాన రహదారులపై ప్రమాదకరంగా డ్రైవింగ్, రైడింగ్ చేయడం లేదా స్టంట్లు చేయడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని గజ్వేల్ టౌన్, ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్, రోడ్డు భద్రతా నిబంధనలను పాటించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని కోరారు.




