Dubbak: ఆర్భాటంగా ప్రారంభం.. ఆరు నెలలకే నిర్లక్ష్యం
Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ₹43 లక్షలతో నిర్మించిన చిల్డ్రన్స్ పార్క్ నిర్లక్ష్యానికి గురైంది. ఏడాదిలోనే ఆటవస్తువులు పాడైపోవడంపై స్థానికుల ఆగ్రహం.
Dubbak: ఆర్భాటంగా ప్రారంభం.. ఆరు నెలలకే నిర్లక్ష్యం
Dubbak: దుబ్బాకలోని చిల్డ్రన్స్పార్క్ దుస్థితి, అది పిల్లల ఆటవిడుపుకు లక్షలు వెచ్చించిన పిల్లల పార్క్, ఉద్యానవనంగా తీర్చేందుకు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణం లోని 18వ వార్డులో ప్రజల ఆహ్లాదం కోసం టీయూఎఫ్ఐడీసీ నిధుల కింద రూ.43 లక్షలతో నిర్మించిన ఉద్యనం, ప్రారంభించి ఏడాది గడవక ముందే అధ్వాన స్థితికి చేరుకుంది.
అసలే నాణ్యత ప్రమాణాలకు తిలోద కాలిచ్చారనే ఆరోపణల మధ్య మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా గతేడాది ఘనంగా ప్రారంభించిన ఈ పార్క్, ఆర్భాటానికే పరిమితమైపో యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వహణ లోపంతో ఆరు నెల లుగా ఈ పార్క్ నిర్లక్ష్యానికి గురై, అపరిశుభ్ర వాతావరణంగా మారిపో యింది.
పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బెల్ట్ ఊయలలు ఇప్పటికే తెగిపోయి మూలనపడ్డాయి. వీటి నాణ్యతలోపంతో అనతికాలంలోనే ఆట కెక్కాయి. ఆటవస్తువులు వినియోగంలోకి రాకముందే పాడైపోవడం. పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్నారుల ఆట పాటల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ విభాగం ఇప్పుడు నిర్జీవంగా మారిపోయింది.




