Siddipet: పొట్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ స్కూల్ ప్రారంభం!
Siddipet: సిద్దిపేట జిల్లా పొట్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ స్కూల్‌ను గ్రామ సర్పంచ్ రాచపల్లి శ్రీనివాస్, ఎంఈఓ మనీలా ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
Siddipet: పొట్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ స్కూల్ ప్రారంభం!
సిద్దిపేట జిల్లా: పొట్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రాచపల్లి శ్రీనివాస్, ఎంఈఓ మనీలా ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రాచపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చొప్పరి శ్రీనివాస్, మవుటం రాధా, చుక్క పుష్పలత, ఉన్నత పాఠశాల హెచ్ఎం సంధ్యశ్రీ, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం స్వరూప, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి చక్కా వెంకటేశ్వరరావు, జీపీఓ ప్రవీణ్ రెడ్డి, అంగన్‌వాడీ టీచర్లు వనజ, ప్రేమలత, పాఠశాల అధ్యక్షురాలు దేవాసాని కళ్యాణి, జేరిపోతుల స్వరూపతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.




