Siddipet: ఏకగ్రీయంగా తొగుట మండల PRTU TS కొత్త కమిటీ ఎన్నిక!

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో పీఆర్టీయూ టీఎస్ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించి, నూతన మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 26 Aug 2026 9:28 AM IST
Siddipet
X

Siddipet: ఏకగ్రీయంగా తొగుట మండల PRTU TS కొత్త కమిటీ ఎన్నిక!

Siddipet: సిద్దిపేట జిల్లా PRTU TS తొగుట మండల శాఖ సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షులు పి. రామచంద్రారెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది.ఈ సమావేశంలో గత రెండు సంవత్సరాలుగా మండల శాఖ నిర్వహించిన సంఘ కార్యక్రమాలు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన కార్యక్రమాలు మరియు సంఘ కార్యకలాపాల వివరాలను మండల ప్రధాన కార్యదర్శి శ్రీ బి. సురేందర్ రెడ్డి గారు నివేదిక రూపంలో ప్రవేశపెట్టారు.

ముఖ్య అతిథుల పాల్గొనడం ఈ కార్యక్రమంలో PRTU TS అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, రాష్ట్ర బాధ్యులు హనుమారెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు మల్లు ఇంద్రసేనారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఆధారాశుపల్లి శశిధర్ శర్మ గారు పాల్గొన్నారు.మండలంలోని PRTU TS సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story