Thoguta: తొగుటలో పిఆర్టియుటిఎస్ సభ్యత్వ నమోదు
Thoguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో పిఆర్టియుటిఎస్ (PRTUTS) ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
Thoguta: తొగుటలో పిఆర్టియుటిఎస్ సభ్యత్వ నమోదు
Thoguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వివిధ పాఠశాలలో పి ఆర్ టి యు టి ఎస్ తోగుట మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిఆర్టియుటిఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పుల్లగుర్ల రామచంద్రారెడ్డి బత్తుల సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 50 శాతం ఫిట్మెంట్తో పిఆర్సిని ప్రకటించాలని,
హెల్త్ కార్డులను ఇచ్చి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో నగదు రహిత వైద్య చికిత్సలను ప్రారంభించాలని, రిటైర్డ్ ఉపాధ్యాయులకు వారి బెనిఫిట్స్ తక్షణమే అందించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి మెడికల్ బిల్లులు, సరెండర్ మరియు డి ఎ ఏరియర్స్ బిల్లులు ఉద్యోగుల ఖాతాలో జమ చేయాలని,
2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకటించినట్లుగా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలి అని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలన్నారు.




