Cherial: చేర్యాలలో బరితెగించిన అక్రమ వెంచర్లు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు

Cherial: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 22 Oct 2026 1:13 PM IST
Cherial
X

Cherial: చేర్యాలలో బరితెగించిన అక్రమ వెంచర్లు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు

Cherial: చేర్యాల పట్టణ పరిధిలో పెద్దమ్మ గడ్డ నర్సాయపల్లి వెళ్లే రోడ్డు కు ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ల ఏర్పాటు విషయంలో నిబంధనలు పాటించకుండా సంబంధిత శాఖల అనుమతులు తీసుకోకుండా ప్లాట్లు చేసి అమ్మడాన్ని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

వెంచర్ల నిర్వహణపై పర్యవేక్షణ చేయాల్సిన సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం తో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తుంటే సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, చేర్యాల పట్టణ పరిధిలోని వెంచర్లపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL