bhumpally: తాళ్లపల్లిలో పల్స్ పోలియో.. చిన్నారులకు చుక్కలు వేసిన నేతలు

bhumpally: సిద్దిపేట జిల్లా తాళ్లపల్లిలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి, సర్పంచ్ ప్రభాకర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

Chindam Karunakar, Dubbak
Published on: 28 Jun 2026 2:42 PM IST
bhumpally
X

bhumpally: తాళ్లపల్లిలో పల్స్ పోలియో.. చిన్నారులకు చుక్కలు వేసిన నేతలు

భూంపల్లి: చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి శాశ్వతంగా రక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, సర్పంచ్ నీల ప్రభాకర్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, సర్పంచ్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అని,ఆరోగ్యవంతమైన చిన్నారులే దేశానికి నిజమైన సంపద అని తెలిపారు.

పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి" అని అన్నారు.ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రజలందరూ ఆరోగ్య శాఖకు సహకరించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story