Dubbak: దుబ్బాకలో రాహుల్ గాంధీ బర్త్ డే సందడి.. కేక్ కట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి!

Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

Chindam Karunakar, Dubbak
Published on: 20 Jun 2026 8:27 AM IST
Dubbak
X

Dubbak: దుబ్బాకలో రాహుల్ గాంధీ బర్త్ డే సందడి.. కేక్ కట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి!

Dubbak: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, దేశ ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ గారని పేర్కొన్నారు.

గాంధీ కుటుంబం దేశ నిర్మాణంలో అందించిన సేవలు చిరస్మరణీయమని, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దూరదృష్టి భారతదేశాన్ని సమాచార సాంకేతిక రంగంలో ముందంజలో నిలిపిందని, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గారి నాయకత్వం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని గుర్తు చేశారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story