Dubbaka: సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట సర్పంచ్ పద్మ వెంకటేష్ తన గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

Chindam Karunakar, Dubbak
Published on: 23 May 2026 11:43 AM IST
Dubbaka
X

Dubbaka: సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

దుబ్బాక: ఎన్నికల్లో గెలిస్తే అది చేస్తాం అని ఎన్నో హామీలు ఇస్తారు సర్పంచులు కానీ ఈ సర్పంచ్ మాత్రం తన ఊరి ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్నారేమో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు.సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన పద్మ వెంకటేష్ ను ప్రజలు గ్రామ సర్పంచిగా ప్రజలు గెలిపించారు.

సర్పంచిగా గెలిచిన నుండి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ తన ప్రజల ఆరోగ్యం బాగుంటే ఊరు బాగుంటుందని ఆలోచన చేసిన సర్పంచ్ పద్మ వెంకటేష్ మారుమూల ప్రాంతమైన రాజక్కపేట గ్రామానికి వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్లను తెప్పించి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలున్న వారికి ఆ వ్యాదికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ కు చూపించి వారికి సరిపడే మెడిసిన్ అందించారు.

ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వారి సమస్యకు డాక్టర్లతో సహకారం అందించి వారికి సరిపడే మెడిసిన్ అందించారు. సర్పంచ్ పద్మ వెంకటేష్ మాట్లాడుతూ తన గ్రామ ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రజలు బాగుంటే గ్రామాలు బాగుంటాయన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story