Siddipet: పదేళ్లుగా అద్దె కొంపలోనే పోలీస్ స్టేషన్: సొంత భవనం ఎప్పుడో?

Siddipet: సిద్దిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటై దశాబ్దం దాటుతున్నా ఇప్పటికీ సొంత భవనం కలగానే మిగిలింది.

Chindam Karunakar, Dubbak
Published on: 17 May 2026 8:22 AM IST
Siddipet
X

Siddipet: పదేళ్లుగా అద్దె కొంపలోనే పోలీస్ స్టేషన్: సొంత భవనం ఎప్పుడో?

Siddipet: మండలం ఏర్పడి దశాబ్దం దాటుతున్నా రాయపోల్ పోలీస్ స్టేషన్ కు సొంత భవనం మాత్రం కలగానే మిగిలింది. అద్దె భవనంలోనే అరకొర వసతులతో పోలీస్టేషన్ కొనసాగుతుండగా, సిబ్బంది నుంచి ప్రజల వరకు ఇబ్బందులు తప్పడం లేదు. భవన నిర్మాణానికి స్థలం కేటాయించి పనులు ముందుకు సాగకపోవడంతో స్థానికుల్లో అసంతృప్తి వ్యక్త మనుతోంది. వివరాల్లోకి వెళ్తే.

సిద్ధిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటై సుమారు పదేళ్లు గడుస్తున్నా ఇప్ప టికీ అద్దె భవనంలోనే కొనసాగుతోంది. 2017లో కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా రాయపోల్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ప్రారంభం నుంచి అద్దె భవనం లోనే పోలీస్ స్టేషన్ కొనసాగుతుండగా అరకొర వసతు లతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీస్ స్టే షన్ ఏర్పాటైన ప్రారంభ దశలో భవన నిర్మాణానికి అవ సరమైన స్థలం అందుబాటులో లేకపోవడంతో కొత్త భవనం మంజూరు నిలిచిపోయినట్లు ప్రచారం జరిగింది.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story