Dubbak: ఎమ్మెల్యే రాజీనామా చేసిన రోజే దుబ్బాకకు అసలైన దీపావళి: చెరుకు శ్రీనివాస్

Dubbak: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన రోజే ప్రజలకు నిజమైన దీపావళి అని కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 12 Nov 2026 3:56 PM IST
Dubbak
X

Dubbak: ఎమ్మెల్యే రాజీనామా చేసిన రోజే దుబ్బాకకు అసలైన దీపావళి: చెరుకు శ్రీనివాస్

దుబ్బాక: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే దుబ్బాక ప్రజలకు నిజమైన దీపావళి అవుతుందని సవాల్ విసిరారు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పలు గ్రామాల్లో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

చెరుకు శ్రీనివాస్ రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ నిన్నటి రోజున దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆయనకు విషయాలపై అవగాహన లేదని, ఆయన మాటలు వింటే నవాలో ఏడవాలో అర్థం కావడం లేదని అన్నారు.

పోతారం గ్రామంలో కాల్వల డిజైన్ మార్పు విషయంలో రైతులకు అన్యాయం జరగడం వల్లే వారు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, బీఆర్ఎస్ పాలనలో రైతుల హక్కులు కాల రాయబడ్డాయని విమర్శించారు.మల్లన్న సాగర్ నిర్మాణం 18 నెలలు ఆగిపోవడానికి బీఆర్ఎస్ నాయకుల అసమర్థతే కారణమని, చెరుకు ముత్యం రెడ్డి చొరవ వల్లే ఆ ప్రాజెక్టు పూర్తయిందని తెలిపారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK