Husnabad: హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఊడిపడిన పైకప్పు తప్పిన ప్రమాదం!

Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో కూలిన పైకప్పు. ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. భయాందోళనలో ప్రయాణికులు.

SRINIVAS, HUSNABAD
Published on: 25 Sept 2026 10:31 AM IST
Husnabad
X

Husnabad: హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఊడిపడిన పైకప్పు తప్పిన ప్రమాదం!

Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో ప్రమాదం తప్పింది. బస్టాండ్ లోని సిద్దిపేట, సికింద్రాబాద్ 7 వ నంబర్ ప్లాట్ ఫామ్ వద్ద సాయంత్రం పై కప్పు ఉడిపోయి కిందపడింది. ప్రయాణికుల రద్దీ లేని సమయంలో పైకప్పు కింద పడడంతో ప్రమాదం తప్పింది. పైకప్పు కింద పడ్డ సమయంలో ఎవరైనా ప్రయాణికులు ఉంటే బలమైన గాయాలు తగిలేవి.

గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పైకప్పు తడిచి ఊడిపోయి కింద పడ్డట్లు కనిపిస్తోంది. బస్టాండులో మరికొన్ని చోట్ల ఊడిపడే స్థితిలో పైకప్పు ఉండడంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. ప్రమాదం జరగకముందే మరమ్మత్తు చేయించాలని కోరుతున్నారు.

SRINIVAS, HUSNABAD

SRINIVAS, HUSNABAD