Gajwel: 20 రోజుల్లోనే రూ.14.80 లక్షల డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్!

Gajwel: గజ్వేల్‌లో దివంగత మాగపు వెంకటలక్ష్మి పాలసీకి సంబంధించి రూ.14,80,055 డెత్ క్లెయిమ్‌ను టాటా ఏఐఏ సంస్థ 20 రోజుల్లోనే సెటిల్ చేసి నామినీకి అందించింది.

Osman Pathan, GAJEWL
Published on: 13 Nov 2026 11:41 PM IST
Gajwel
X

Gajwel: 20 రోజుల్లోనే రూ.14.80 లక్షల డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్!

గజ్వేల్: కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో బాధిత కుటుంబానికి జీవిత బీమా ఆర్థిక భరోసాగా నిలిచింది. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ కేవలం 20 రోజుల్లోనే రూ.14,80,055 డెత్ క్లెయిమ్‌ను పరిష్కరించి, నామినీ మాగపు సత్యనారాయణకు బీమా మొత్తాన్ని అందజేసింది. గజ్వేల్‌కు చెందిన దివంగత మాగపు వెంకటలక్ష్మి 2026 ఆగస్టు 30న మరణించారు.

ఆమె బీమా పాలసీకి నామినీగా ఉన్న సత్యనారాయణ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోగా, అవసరమైన ప్రక్రియను పూర్తి చేసిన సంస్థ ప్రతినిధులు వేగంగా స్పందించి కేవలం 20 రోజుల్లోనే రూ.14,80,055 మొత్తాన్ని సెటిల్ చేశారు.

ఈ సందర్భంగా టాటా ఏఐఏ కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ ఆదర్శ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్లు నవీన్, మహేందర్, పార్టనర్ గుడెల్లి రాజు, సీనియర్ లీడర్లు ప్రసాద్ రాయపోల్, దులం రమేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. జీవిత బీమా అనేది కేవలం ఒక పాలసీ మాత్రమే కాదని, కుటుంబ పెద్దను కోల్పోయిన క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే భరోసా అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవిత బీమా ప్రాధాన్యతను గుర్తించి, తగిన బీమా రక్షణ పొందాలని సూచించారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL