Dubbak: నిలిచిన ఆర్టీసీ చక్రం.. డిపో ముందు కార్మికుల నిరసన!
Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ సమ్మె ఉధృతం. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో బస్సులు డిపోకే పరిమితం.
Dubbak: నిలిచిన ఆర్టీసీ చక్రం.. డిపో ముందు కార్మికుల నిరసన!
Dubbak: సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ జేఏసీ సమ్మె బాట పట్టింది. ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు డిపోలో ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి. పరిష్కారం కోసం అధికారుల కమిటీ ఆర్టీసీ జేఏసీని 4 వారాలు గడువు కోరింది. అంగీకరించని ఆర్టీసీ జేఏసీ అర్ధరాత్రి నుంచే బస్సులను నిలిపివేసింది.
ఆర్టీసీ జేఏసీ బంద్ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్సు డిపోలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచే ఆర్టిసి కార్మికులు సమ్మెకు దిగారు. ఉదయం నుంచి ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిపో ముందు నిలబడి నిరసన వ్యక్తం చేశారు. డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు.
సమ్మె నేపథ్యంలో ఎలాంటిఅవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు బస్ డిపో, బస్ స్టేషన్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరక సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు స్వచ్ఛందంగా ఈ సమ్మెలోపాల్గొనడం జరిగిందని పేర్కొన్నారు.




