Gajwel: దసరా సెలవుల్లో జాగ్రత్తలు తప్పనిసరి!
Gajwel: దసరా సెలవుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గజ్వేల్ రూరల్ సీఐ రవి రాజు సూచన. తాళం వేసిన ఇళ్లు, ప్రయాణాలు, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల వెల్లడి.
Gajwel: దసరా సెలవుల్లో జాగ్రత్తలు తప్పనిసరి!
Gajwel: దసరా పండుగ, సెలవుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ భద్రతా జాగ్రత్తలు పాటించాలని గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి రాజు సూచించారు. పండుగ సందర్భంగా స్వగ్రామాలకు, విహారయాత్రలకు వెళ్లేవారు ఇంటి తలుపులు, కిటికీలకు తాళాలు వేసుకోవాలని, విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని కోరారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించవద్దన్నారు.
ప్రయాణ సమయంలో హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. రద్దీ ప్రదేశాల్లో విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఓటీపీ, బ్యాంకు వివరాలను ఇతరులకు తెలియజేయవద్దన్నారు. సైబర్ ఆర్థిక మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
అత్యవసర పోలీస్ సహాయం కోసం 112 నంబర్ను సంప్రదించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు పోలీసులకు సహకరించి దసరా పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని సీఐ రవి రాజు విజ్ఞప్తి చేశారు.




