Thoguta: జప్తిలింగరెడ్డిపల్లిలో శాస్త్రవేత్తల రైడ్.. రైతులకు బంపర్ ఆఫర్!
Thoguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలం జప్తిలింగరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం.
Thoguta: జప్తిలింగరెడ్డిపల్లిలో శాస్త్రవేత్తల రైడ్.. రైతులకు బంపర్ ఆఫర్!
సిద్దిపేట జిల్లా: తొగుట మండలం జప్తిలింగరేడ్డిపల్లి గ్రామంలో వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల వారు, సిద్ధిపేట జిల్లా వ్యవసాయ శాఖ వారి సహకారంతో మెరుగైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని” నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త ఎ.రమాదేవి మాట్లాడుతూ నానో యూరియా వాడకం, నేల సంరక్షణ, పచ్చిరొట్ట ఎరువులు వాడకం మరియు సేంద్రియ వ్యవసాయం గురించి, వివిధ పంటల్లో సాగునీటిని ఆదా, ప్రత్యామ్నాయ పంటల సాగు లాంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్. సురేందర్, టీచింగ్ అసిస్టెంట్ మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరి సన్న రకాలు KNM-1638, BPT -5204, WGL-44 ,WGL 962,RNR 15048 వంటివి బోనస్ రకాలు అని, వివిధ పంటల లో సిఫారసు మేరకు యూరియా వాడకం అవగాహన కలిగించారు. తదుపరి మోహన్, వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, నేల ఆరోగ్యం,మట్టి పరీక్షల గురించి తెలిపారు.




