Siddipet: భూంపల్లిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు!

Siddipet: భూంపల్లిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాపన్నకు నివాళులర్పించారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 19 Aug 2026 10:09 AM IST
Siddipet
X

Siddipet: భూంపల్లిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు!

Siddipet: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన:ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం భూంపల్లి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించార ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, అణగారిన వర్గాల ఆత్మగౌరవం, హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వీరుడు అని కొనియాడారు.

సమాజంలో అణగారిన వర్గాలకు సమానత్వం, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కల్పించాలనే లక్ష్యంతో ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.సర్వాయి పాపన్న గౌడ్ గారి ధైర్యసాహసాలు, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేటి సమాజంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story