Toguta: మృతుడి కుటుంబానికి సర్పంచ్ సమీరా పరమేశ్వర్ రెడ్డి ఆర్థిక సాయం!

Toguta: తొగుట మండలం చిన్నముత్యంపేటలో ఇటీవల మరణించిన పిట్టల శివకుమార్ కుటుంబానికి సర్పంచ్ ఎన్. సమీరా పరమేశ్వర్ రెడ్డి సోమవారం రూ.5,000 ఆర్థిక సాయం అందించారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 16 Nov 2026 4:06 PM IST
Toguta
X

Toguta: మృతుడి కుటుంబానికి సర్పంచ్ సమీరా పరమేశ్వర్ రెడ్డి ఆర్థిక సాయం!

సిద్దిపేట జిల్లా: తొగుట మండలం గోవర్ధనగిరి మధిర గ్రామమైన చిన్న ముత్యంపేట గ్రామంలో ఇటీవలే మరణించిన పిట్టల శివకుమార్ వారి కుటుంబానికి గోవర్ధనగిరి సర్పంచ్ సమీరా పరమేశ్వర్ రెడ్డి సహకారంతో తక్షణమే ఆర్థిక సహాయంగా మృతుడి కుమారుడు శివశంకర్ కి 5000/- రూపాయలు అందజేసి వారి కుటుంబానికి అన్ని విధాలుగా ఎల్లవేళలా తోడుంటామని, కష్టాలల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటానని సర్పంచ్ సమీరా పరమేశ్వర్ రెడ్డి గారు భరోసా ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ AMC డైరెక్టర్ దుబ్బాక కనకయ్య,వార్డు సభ్యులు లింగం,తుమ్మల విజయ్, కుమార్, దశరతం,ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK