Siddipet: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సర్పంచుల పాలాభిషేకం!
Siddipet: సర్పంచుల పెండింగ్ గౌరవ వేతనాలు విడుదల చేసినందుకు గాను సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు సర్పంచుల ఘన పాలాభిషేకం.
Siddipet: సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సర్పంచుల పాలాభిషేకం!
Siddipet: రాష్ట్రంలోని సర్పంచులకు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలను విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి,దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో సర్పంచులు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న సర్పంచుల సమస్యలను గుర్తించి గౌరవ వేతనాలను విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామీణ స్థానిక సంస్థలకు మరింత ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి,కర్నాల శ్రీనివాసరావు, సర్పంచులు బండారు లాలూ పాల్గొన్నారు.




