Dubbak: సిద్దిపేట జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Dubbak: అక్బర్ పేట భూంపల్లి మండలంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.
Dubbak: సిద్దిపేట జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Dubbak: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అందించడంలో రేషన్ కార్డులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్న నిత్యావసర సరుకులు మరింత పారదర్శకంగా, సులభంగా అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అర్హత ఉన్నప్పటికీ ఏవైనా వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు




