Siddipet: జాతీయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం
Siddipet: సిద్దిపేట జిల్లాలో జాతీయ అవార్డు గ్రహీతలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఘనంగా సన్మానించారు.
Siddipet: జాతీయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం
సిద్దిపేట జిల్లా: అక్బర్పేట్-భూంపల్లి మండల కేంద్రంలో సమాజ సేవ, మహిళా సాధికారత, విద్యా చైతన్యం, సామాజిక న్యాయం ప్రజా ఉద్యమాల ద్వారా విశిష్ట సేవలు అందించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అవార్డు గ్రహీతలను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఘనంగా సన్మానించి అభినందించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట్-భూంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జాతీయ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత బండమీది మల్లయ్య, జాతీయ జయశంకర్ అవార్డు గ్రహీత చంద్రారెడ్డి శంకరవ్వ, జాతీయ ఉమెన్ లీడర్షిప్ అవార్డు గ్రహీత నెల్లుట్ల నర్సవ్వలను బక్కి వెంకటయ్య శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న సామాజిక కార్యకర్తలు, మహిళా నాయకులు, ప్రజా ఉద్యమకారులకు లభిస్తున్న జాతీయ స్థాయి గుర్తింపు సమాజానికి గర్వకారణమని అన్నారు.




