Siddipet: దుబ్బాకలో ఘనంగా మహనీయుల స్మరణ.. ఉత్సవ సభ కరపత్రం ఆవిష్కరణ

Siddipet: పెద్ద చీకోడ్‌లో 30న నిర్వహించనున్న మహనీయుల ఉత్సవ సభ కరపత్రాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.

Chindam Karunakar, Dubbak
Published on: 27 April 2026 10:47 AM IST
Siddipet
X

Siddipet: దుబ్బాకలో ఘనంగా మహనీయుల స్మరణ.. ఉత్సవ సభ కరపత్రం ఆవిష్కరణ

సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామంలో నిర్వహించనున్న 30 న మహనీయుల ఉత్సవ సభకు సంబంధించిన కరపత్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదివారం భూంపల్లి, అక్బర్‌పేట మండల కేంద్రంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహనీయులను స్మరించుకోవడం సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. మహాత్మా జ్యోతి రావు పూలే సామాజిక విప్లవానికి నాంది పలికారని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్తగా పేదలు, బలహీన వర్గాలకు హక్కులు కల్పించి సమానత్వానికి పునాది వేశారని పేర్కొన్నారు. అలాగే బాబు జగ్జీవన్ రామ్ దేశంలో తొలి దళిత ఉప ప్రధానిగా ప్రజాసేవలో నిలిచారని గుర్తుచేశారు. సమాజంలో అసమానతలు లేకుండా ఉండాలన్న మహనీయుల ఆశయాలను నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చీకోడ్ గ్రామంలో నిర్వహించే ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story