Bhumpally: భూంపల్లి తాగునీటి ట్యాంక్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన చైర్మన్

Bhumpally: భూంపల్లిలో తాగునీటి సమస్య తీర్చేందుకు వాటర్ ట్యాంక్ నిర్మాణం. స్థలాన్ని పరిశీలించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.

Chindam Karunakar, Dubbak
Published on: 10 July 2026 3:31 PM IST
Bhumpally
X

Bhumpally: భూంపల్లి తాగునీటి ట్యాంక్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన చైర్మన్

భూంపల్లి: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం భూంపల్లి గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రూరల్ వాటర్ సప్లై (ఆర్‌డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో ప్రతిపాదిత వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య గారు,గ్రామ సర్పంచ్ జన్నారెడ్డి సంబంధిత ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా శాశ్వత పరిష్కారం కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు,అలాగే వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభమయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించడం,గ్రామ అభివృద్ధికి అవసరమైన ప్రతి పనికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story