కోర్టు కేసులకే పరిమితమా?.. వినియోగదారుల ఉద్యమంపై కుంభాల రవీందర్ వ్యాఖ్యలు!
వినియోగదారుల ఉద్యమం కేవలం కోర్టు కేసులకే పరిమితం కాకూడదని జిల్లా వినియోగదారుల అసోసియేషన్ అధ్యక్షుడు కుంభాల రవీందర్ అన్నారు.
వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం దేశంలో ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుతం వాటి కార్యకలాపాలు ఎక్కువగా సేవలలో లోపాలు (Deficiency in Service), వస్తువుల నాణ్యత లోపాలు (Defect in Goods), వినియోగదారుల కమిషన్లలో కేసులు దాఖలు చేయడం, పరిహారం పొందడం వంటి అంశాలకే పరిమితమవుతున్నాయని జిల్లా వినియోగదారుల అసోసియేషన్ అధ్యక్షుడు కుంభాల రవీందర్ పేర్కొన్నారు.
వినియోగదారుల ఉద్యమం కేవలం కోర్టు కేసుల వరకే పరిమితం కాకుండా, సమాజంలోని ప్రతి రంగంలో వినియోగదారుల హక్కులను పరిరక్షించే బలమైన ప్రజా ఉద్యమంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం సెక్టరు వారీగా ప్రత్యేక వినియోగదారుల సంఘాలు ఏర్పాటు చేయడం కాలానుగుణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రతి రంగంలో వినియోగదారులు ఎదుర్కొనే సమస్యలు భిన్నంగా ఉంటాయని, ఆ రంగంపై అవగాహన కలిగిన ప్రత్యేక సంఘాలు ఉంటే సమస్యలను లోతుగా అధ్యయనం చేయాలి.




