Dubbaka: దుబ్బాక మండలం తిమ్మాపూర్‌లో ఘనంగా విత్తన మేళా
Dubbaka: సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో డిసిఎంఎస్, ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో విత్తన మేళా. సన్న వడ్ల సాగుతో క్వింటాల్‌కు రూ.500 బోనస్ వస్తుందని వెల్లడి.
Dubbaka: దుబ్బాక మండలం తిమ్మాపూర్‌లో ఘనంగా విత్తన మేళా
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ రైతు వేదికలో డీసీఎంఎస్, ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో సోమవారం విత్తన మేళా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) రేణుక, దుబ్బాక ఎఫ్‌పీఓ చైర్మన్ తీపిరెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ..
ప్రభుత్వం కేటాయించిన ఏడు రకాల సన్న వడ్లు బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్–15048, కేఎన్‌ఎం–1638, జై శ్రీరామ్, హెచ్‌ఎంటీ సోనా, వరంగల్–44, కేఎన్‌ఎం–7715తో పాటు మూడు రకాల దొడ్డు వడ్లు ఎంటీయూ–1010 (MTU–1010), జేజీఎల్–24423 (JGL–24423), కేఎన్‌ఎమ్–118 (KNM–118)లను సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.
ప్రభుత్వం ప్రకటించిన సన్న వడ్లను మార్కెట్‌లో విక్రయించిన రైతులకు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ అందజేస్తుందని తెలిపారు. ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేయడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. అలాగే విత్తనాలు కొనుగోలు చేసే ప్రతి రైతు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు.




