Siddipet: హుస్నాబాద్, అక్కన్నపేట పరిధిలో దొంగతనాలు.. నిందితుడు అరెస్ట్
Siddipet: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న రౌతు పవన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Siddipet: హుస్నాబాద్, అక్కన్నపేట పరిధిలో దొంగతనాలు.. నిందితుడు అరెస్ట్
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మరియు అక్కన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జూన్ 18 , జూన్ 26 మరియు జూలై 2 తారీఖున దొంగతనాలు చేసిన నిందితుడు రౌతు పవన్ ను హుస్నాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్
కె.శ్రీధర్ పోలీసు కస్టడీ లోకి తీసుకొని నిందితుడిని విచారించగ ఇట్టి దొంగతనం చేసిన 11 కిలోల పంచలోహ విగ్రహం, 56 గ్రాముల బంగారం, 76 గ్రాముల వెండి మరియు 23,500 నగదు ను కరీంనగర్ లో దాచినాడని తెలుపగ కరీంనగర్ లో ఇట్టి కేసు ప్రాపర్టీ ని స్వాదినం చేసుకున్నారు. ఇట్టి కేసు దర్యాప్తు లో పాల్గొన్న హుస్నాబాద్ SI P. లక్ష్మా రెడ్డి, CCS టీం, హుస్నాబాద్ హెచ్ రవీందర్, PC N. నరేశ్, D. శ్రీనాథ్ మరియు CCS టీమ్ ని హుస్నాబాద్ ఏసీపీ సదానందం అభినంధించినారు
Next Story




