Dubbaka: దుబ్బాకలో యాంటీ నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో యాంటీ నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు మెరుపు తనిఖీలు చేపట్టారు.
Dubbaka: దుబ్బాకలో యాంటీ నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు
Dubbaka: గంజాయి, డ్రగ్స్, కొకైన్ వంటి మత్తు పదార్థాలకు విద్యార్థులు, యువత బానిసలు కావద్దని, మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని దుబ్బాక ఎస్సై కే.కీర్తి రాజు తెలిపారు..సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని బస్టాండ్ వద్ద పలు కిరాణా, పాన్ దుకాణాలు, పట్టణ శివారులోని రెండు పడక గదుల గృహ సముదాయాల్లో మత్తు పదార్థాల నియంత్రణే లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ పొందిన యాంటీ నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్ సహాయంతో దుబ్బాక పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత జీవితాలను చిత్తు చేస్తున్న మాదకద్రవ్యాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నిషేధిత గుట్కాలు, గంజాయి, డ్రగ్స్ వంటి వాటిని విక్రయించినా, రవాణాకు పాల్పడినా, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.యువతను పెడదోవ పట్టిస్తున్న అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎవరికైనా మత్తు పదార్థాల అమ్మకం, రవాణా, వినియోగం గురించి సమాచారం తెలిస్తే, వెంటనే పోలీసులకు తెలపాలన్నారు.




