Siddipet: ఫ్యానుకు ఉరివేసుకుని యువతి ఆత్మహత్య!

Siddipet: నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో 19 ఏళ్ల యువతి శ్రావణి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RAJU, SIDDIPET
Published on: 14 Oct 2026 11:07 PM IST
Siddipet
X

Siddipet: ఫ్యానుకు ఉరివేసుకుని యువతి ఆత్మహత్య!

సిద్దిపేట: యువతి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సూర రజిత రమేష్ ల కు ఇద్దరు కుమార్తెలు చిన్న కూతురు శ్రావణి (19) సిద్దిపేటలోని శ్రీ మంజునాథ ఆస్పత్రిలో పనిచేస్తుంది.

మంగళవారం రాత్రి ఆసుపత్రిలో నైట్ డ్యూటీ చేసి బుధవారం ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చిన శ్రావణి చేతికి ఇంజక్షన్ ఇచ్చిన ఆనవాళ్లు కనబడడంతో తండ్రి ఏం జరిగిందని కూతుర్ని మందలించాడు.

ఛాతిలో నొప్పి వల్ల ఇంజక్షన్ పెట్టుకున్నానని బదిలించింది. తండ్రి బ్యాంకుకు వెళ్లి వచ్చేసరికి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతికి గల కారణాలు తెలవకపోవడంతో పూర్తి విచారణ గావించి న్యాయం చేయాలని తండ్రి ఎస్సైకి ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారూ.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET