Siddipet: దళితులపై శుద్ధి ఘటన - ఏడుగురు నిందితుల అరెస్ట్, రిమాండ్
Siddipet: సిద్దిపేట జిల్లా వరదరాజ్‌పూర్‌లో దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచిన ఘటనలో ఏడుగురు నిందితుల అరెస్ట్. గజ్వేల్ మెజిస్ట్రేట్ 15 రోజుల రిమాండ్ విధించారు.
Siddipet: దళితులపై శుద్ధి ఘటన - ఏడుగురు నిందితుల అరెస్ట్, రిమాండ్
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ శుద్ధీకరణ పేరిట దళితులను అవమానించిన ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను మర్కుక్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.మర్కుక్ మండలం వరదరాజ్‌పూర్‌లో దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మర్కుక్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
కేసు దర్యాప్తులో భాగంగా వరదరాజ్‌పూర్‌కు చెందిన ఏడుగురు నిందితులను విజయవాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం ఉదయం వారిని మర్కుక్‌కు తీసుకొచ్చారు. అనంతరం గజ్వేల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
అప్పల ప్రవీణ్, రెడ్డిమల్ల అమరేందర్, శ్రీపతి రాజు, ముచ్చపతి హిమవంత్, అంతాని ఐలయ్య, అర్కాల రాజు, అంతాని మల్లేష్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులకు గజ్వేల్ మెజిస్ట్రేట్ 15 రోజుల రిమాండ్ విధించడంతో వారిని సిద్దిపేట జిల్లా జైలుకు తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.




