Husnabad: ఎస్‌జీఎఫ్‌ జిల్లా స్థాయి పోటీల్లో హుస్నాబాద్‌కు 3 పతకాలు!

Husnabad: సిద్దిపేటలో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్‌ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో హుస్నాబాద్ విద్యార్థులు రెండు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించి సత్తా చాటారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 26 Oct 2026 6:57 PM IST
Husnabad
X

Husnabad: ఎస్‌జీఎఫ్‌ జిల్లా స్థాయి పోటీల్లో హుస్నాబాద్‌కు 3 పతకాలు!

హుస్నాబాద్‌: 70వ ఎస్‌జీఎఫ్‌ సిద్దిపేట జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో హుస్నాబాద్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన పోటీల్లో మూడు పతకాలు సాధించారు. 17 ఏళ్ల బాలుర విభాగంలో 3 వేల మీటర్ల నడక పోటీలో హుస్నాబాద్ జడ్పీహెచ్ఎస్ బాలుర కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు జి. అశ్వంత్‌ ద్వితీయ స్థానం సాధించి రజత పతకం గెలుచుకోగా, ఎ. ప్రణీత్‌ తృతీయ స్థానంతో కాంస్య పతకం సాధించాడు.

400 మీటర్ల పరుగు పందెంలో హుస్నాబాద్‌ బాలుర జూనియర్‌ కళాశాల విద్యార్థి జి. రిశ్వంత్‌ ద్వితీయ స్థానం సాధించి రజత పతకం కైవసం చేసుకున్నాడు. విజేతలకు ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి నర్రా భాస్కర్‌రెడ్డి, అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె. వెంకటస్వామి పతకాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్‌ పీడీ పి. సుజాత, సుశీల, నవీన్‌కుమార్‌, ఉప్పలయ్య పాల్గొన్నారు. విద్యార్థుల విజయాలపై పాఠశాల హెచ్ఎం కె. వాసుదేవరెడ్డి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల పీడీ ఆర్. శ్రీనివాస్‌ విద్యార్థులను అభినందించారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD