Siddipet: ఎరువును కుప్పలుగా ఉంచితే పోషకాలు మాయం.. ఏఈఓ నాగార్జున
Siddipet: సిద్దిపేట జిల్లా ఎల్లారెడ్డిపేట రైతులు పశువుల ఎరువును పొలంలో ఎక్కువ రోజులు కుప్పలుగా ఉంచవద్దని ఏఈఓ నాగార్జున సూచించారు.
Siddipet: ఎరువును కుప్పలుగా ఉంచితే పోషకాలు మాయం.. ఏఈఓ నాగార్జున
Siddipet: సిద్దిపేట ఎల్లారెడ్డిపేట గ్రామం పశువుల ఎరువు ఎక్కువ రోజులు పొలంలో కుప్పలుగా పెట్టవద్దని వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున రైతులకు సూచించారు. రైతులు భూసారాన్ని పెంచడానికి పశువుల ఎరువుని వేసవికాలంలో పొలంలో వేస్తారు కానీ చాలా రోజుల వరకు వాటిని కుప్పలుగా పెట్టి వాటిని పొలంలో వెదజల్లుకుంటారు.
ఎరువుని పొలంలో కుప్పలుగా చాలా రోజులు పెట్టడం వలన ఎండకు ఎరువులో ఉన్న తేమ తగ్గి పోషకాలు కూడా గాలిలో కలిసిపోతాయి. పై భాగం కూడా గట్టిపడుతుంది తర్వాత చల్లడం కష్టం అవుతుంది.సూక్ష్మజీవుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. వర్షం పడినప్పుడు కూడా వర్షం నీటితో ఎరువులోని పోషకాలు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది మరియు మొక్కకు సమతుల్యమైన పోషకాలు అందకుండా పోతుంది.
ఎక్కువ రోజులు కుప్పలుగా ఉండడంతో పంటకు హాని చేసే పురుగులు కుప్పల్లో చేరి గుడ్లు పెట్టడం జరుగుతుంది తద్వారా వచ్చే పంటకు హాని కలిగే అవకాశం ఉంటుంది. కావున రైతులు ఎరువుని పొలంలో కుప్పలుగా పెట్టిన రెండు నుండి మూడు రోజుల్లోగా వేద జల్లి కల్టివేటర్ తో భూమిలోకలిసేటట్టుగాకలయుదునుకున్నట్లయితే పోషకాలు పూర్తిగా నేలలో కలిసిపోయి పంటకు అందే అవకాశం ఉంటుంది.




