Siddipet: ఒరిగిన 33 కేవీ విద్యుత్ స్తంభం.. రైతుల ఆగ్రహం!

Siddipet: సిద్దిపేట జిల్లా అక్బరుపేట భూంపల్లి మండలం వీరారెడ్డిపల్లిలో ఘోర ప్రమాదం పొంచి ఉంది.

Chindam Karunakar, Dubbak
Published on: 26 May 2026 8:48 AM IST
Siddipet
X

Siddipet: ఒరిగిన 33 కేవీ విద్యుత్ స్తంభం.. రైతుల ఆగ్రహం!

Siddipet: పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు కిందికి వంగి, హైటెన్షన్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నప్ప టికీ, పంట పొలాల్లోనూ ఒరిగిన 33 కేవీ విద్యుత్ స్తంభం మరమ్మత్తుల విషయంలో విద్యుత్ అధి కారులు అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని రైతులు గుండెల్లో గుబులు పెట్టుకొని పొలాల్లో పనులు చేసుకుంటున్నారు.సిద్దిపేట జిల్లా అక్బరుపేట భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు ఆరుగొండ జయరా ములు పొలం వద్ద ఉన్న 33 కేవీ విద్యుత్ స్తంభం భూమిలోకి బాగా ఒరిగిపోయింది. దాంతోపాటు భారీ విద్యుత్ వైర్లు సైతం కిందికి వేలాడుతున్నాయి. ఈ దారుణ పరిస్థితి కళ్లముందే కనిపిస్తున్నా. విద్యుత్ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవ హరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.వైర్లు చాలా కిందికి ఉండటంతో పొలాల్లోకి వె ళ్లడానికే భయమేస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సి వస్తోంది.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story