Siddipet: భూంపల్లి మండలంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం!
Siddipet: సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలోని నగరం, భూంపల్లి, బేగంపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
Siddipet: భూంపల్లి మండలంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం!
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో నగరం, భూంపల్లి, బేగంపేట గ్రామాలలో రైతుల సౌకర్యార్థం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా శంకర్,pacs వైస్ చైర్మన్ కాల్వ నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మెర సంయుక్త శ్రీధర్, పాల్గొన్నారు.




