Siddipet: కాల భైరవ స్వామి ప్రతిష్ఠా మహోత్సవంలో హరీష్ రావు పూజలు!

Siddipet: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో శ్రీ స్వయంభూ కాల భైరవ స్వామి ప్రతిష్ఠా మహోత్సవంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొని పూజలు చేశారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 26 Nov 2026 12:03 PM IST
Siddipet
X

Siddipet: కాల భైరవ స్వామి ప్రతిష్ఠా మహోత్సవంలో హరీష్ రావు పూజలు!

సిద్దిపేట: బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామంలో శ్రీ స్వయంభూ కాల భైరవ అధిష్టాన ప్రత్యంగిరాదేవి దేవస్థానం ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి సిద్ధిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు, మనకొండూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డా రసమయి బాలకిషన్ తో కలసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు బెజ్జంకి క్రాసింగ్ వద్ద బిఆర్ఎస్ నాయకులు భారి గజమాలతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ సనాతన ధర్మంలో పరమశివుడి ఉగ్రరూపాల్లో కాలభైరవుడు అత్యంత శక్తివంతమైన దైవం అని, కాలం అంటే శివుడు, భైరవుడు అంటే భయాన్ని పోగొట్టేవాడు అని అర్థం, కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకొని భక్తుల భయాన్ని తొలగించే ఆ మహాదేవుని ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొనటం పూర్వజన్మ సుకృతం అని, ఆ కాలభైరవ స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని,సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU