Siddipet: ఆరుబయట నిద్రిస్తున్నారా..? అయితే దొంగలతో జాగ్రత్త!

Siddipet: సిద్దిపేట జిల్లా భూంపల్లి పరిధిలోని గ్రామ ప్రజలకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు.

Chindam Karunakar, Dubbak
Published on: 17 May 2026 7:14 AM IST
Siddipet
X

Siddipet: ఆరుబయట నిద్రిస్తున్నారా..? అయితే దొంగలతో జాగ్రత్త!

Siddipet: సిద్దిపేట జిల్లా భూంపల్లి మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు రాత్రిపూట ఇండ్లకు తాళాలు వేసి ఆరు బయట పడుకోవడం మరియు డాబా ల మీద పడుకోవడం చేయడం వల్ల దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కావున ప్రస్తుతం మన పరిస్థితిల దృష్ట్యా భూంపల్లి పోలీసువారి తరఫున ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా ఆరు బయట పడుకున్నటువంటి ప్రజలు బంగారు ఆభరణాలు ధరించడం అంత శ్రేయస్కరం కాదు.

ఇళ్లకు తాళాలు వేసి పడుకోవడం కూడా దొంగతనాలకు ఎక్కువ ఆస్కారం ఇస్తుంది కావున ఎవరు కూడా విలువైన వస్తువులు ఇంట్లో పెట్టి తాళం వేసి గాని ఆరు బయట పడుకున్నప్పుడు ధరించడం కానీ చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం మరియు రాత్రి సమయంలో ఎవరైనా అను మానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నాం.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story